తెలంగాణ
రేవంత్ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
01-10-2026 17:38

మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా రేవంత్ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలలో విభేదాలు సృష్టించేలా మాట్లాడాల్సిన అవసరం రేవంత్‌రెడ్డికి ఏం వచ్చిందని ప్రశ్నించారు. హామీలు గురించి అడిగితే కొత్త వివాదాలు తెరపైకి తెస్తున్నారన్నారు. రాహుల్‌గాంధీ మెప్పుకోసమే రేవంత్‌రెడ్డి అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మత సంబంధ అంశాలపై మాట్లాడితే ప్రజల మద్దతు రాదని, హామీలు అమలు చేసి మంచి పాలన అందిస్తేనే ప్రజల సపోర్టు కాంగ్రెస్‌కు వస్తుందన్నారు. మతం, కులం, ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటేనన్న కిషన్‌రెడ్డి, రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు.
xPress24, HYDERABAD, October 1,