తెలంగాణ
రాష్ట్రంలో కరవు మండలాలను గుర్తించాలి
02-10-2026 09:44

రాష్ట్రంలో కరవు మండలాలను గుర్తించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో నేపథ్యంలో రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం వంద శాతం కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం నిర్దేశించిన కరవు నిర్వహణ మార్గదర్శకాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
xPress24, Hyderabad, October 2,