xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలురాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
తెలంగాణ

రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టి

06-10-2026 17:12
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టి
పులిచింతల జలవిద్యుత్ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు.
xPress24, Hyderabad, October 6, సూర్యాపేట జిల్లాలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల జల విద్యుత్ కేంద్రాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అల్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి పరిశీలించారు. జెన్కో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. రాష్ట్రంలో విద్యుత్ కొరతను పూర్తిగా నివారించడానికి, ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే ప్రాజెక్ట్‌లో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ తీరు, నీటి లభ్యత వంటి అంశాలపై సమీక్ష జరిపారు. సూర్యాపేట జిల్లాలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వద్ద సుమారు 200 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్న 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్' నిర్మాణ పనులను మంత్రులతో కలిసి ఉపముఖ్యమంత్రి పరిశీలించారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ పాఠశాలల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం మునగాల మండలంలో హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన 'కమ్యూనిటీ కిచెన్'ను మంత్రులు ప్రారంభించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరచడంతో పాటు, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ పర్యటన నిదర్శనంగా నిలిచింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.