తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
02-10-2026 17:02

గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, హన్మకొండ, జనగామ, కుమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాసంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సత్యం, అహింస, శాంతి మార్గంలో పయనించడమే గాంధీజీకి ఇచ్చే నిజమైన నివాళి అని వక్తలు కొనియాడారు.
xPress24, HYDERABAD, October 2,