xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్
తెలంగాణ

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డి

12-10-2026 17:42
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి తెలిపారు. రవీంద్రభారతి, లలిత కళాతోరణంతో పాటు ట్యాంక్‌బండ్‌పై వైభవంగా వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు
xPress24, HYDERABAD, October 12, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి తెలిపారు. ప్రకృతికి, పూలకు, మహిళలకు మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని చాటిచెప్పే ఈ పండుగ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు భాషా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. అన్ని జిల్లాల్లోనూ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతితో పాటు లలిత కళాతోరణంలో ఎంగిలిపూల బతుకమ్మ నుంచి వరుసగా ఎనిమిది రోజులపాటు వివిధ సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆటపాటల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు నరసింహారెడ్డి వెల్లడించారు. బతుకమ్మ ఉత్సవాల్లో చివరి రోజైన 'సద్దుల బతుకమ్మ' సందర్భంగా అమరవీరుల స్మారకం నుంచి సుమారు వెయ్యి బతుకమ్మలతో భారీ కళారూపాల ప్రదర్శన నిర్వహిస్తూ ట్యాంక్‌బండ్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ట్యాంక్‌బండ్‌పై సంప్రదాయ బతుకమ్మ ఆటపాటల అనంతరం నిమజ్జనంతో వేడుకలు ముగుస్తాయని, ప్రజలందరూ ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు.

🎥 వీడియో

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డి

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.