ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారులకు సకాలంలో రేషన్ సరుకులు అందాలి
01-10-2026 16:34
ర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరుకులను సకాలంలో అందించాలని, పంపిణీలో జాప్యం జరిగితే చర్యలు తప్పవని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు.
xPress24, Paravathipuram, October 1,
పార్వతీపురం మన్యం, అక్టోబర్ 1:
అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరుకులను సకాలంలో అందించాలని, పంపిణీలో జాప్యం జరిగితే చర్యలు తప్పవని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు అందించే సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
జిల్లా సంయుక్త కలెక్టర్ గురువారం తన ఛాంబర్‌లో జిల్లా సప్లై అధికారి, జిల్లా మేనేజర్ (సివిల్ సప్లైస్), సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు, జీసీసీ బ్రాంచ్ మేనేజర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన ప్రజలందరికీ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు సక్రమంగా, వేగవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల నిల్వలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా జీసీసీ బ్రాంచ్ మేనేజర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. మండల స్థాయిలో డిప్యూటీ తహసీల్దార్లు రేషన్ దుకాణాలు, గోదాములను తరచూ తనిఖీ చేయాలని సూచించారు.
రాబోయే సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ, గోదాముల సదుపాయాలపై అధికారులకు జేసీ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఫిర్యాదులు అందిన వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.