xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూవినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూ
ఆంధ్రప్రదేశ్

ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్ష

07-10-2026 17:47
ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్ష
సీఆర్‌డీఏ అధికారులు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లతో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
xPress24, Amaravati, October 7, అమరావతి: సీఆర్‌డీఏ అధికారులు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లతో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌ కార్తీక్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో కొనసాగుతున్న ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి అధికారులతో చర్చించారు. ల్యాండ్‌ పూలింగ్‌ కోసం నోటిఫై చేసిన భూముల్లో ఇంకా ఎంత మేర భూమిని సమీకరించాల్సి ఉందో అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, భూసమీకరణలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులను వివరాలు అడిగారు. రాజధానిలో చేపడుతున్న రహదారులు, ఇతర మౌలిక వసతుల నిర్మాణాలకు అవసరమైన భూమిలో ఇంకా ఎంత మేర ల్యాండ్‌ పూలింగ్‌ చేయాల్సి ఉందనే అంశంపై కూడా మంత్రి ఆరా తీశారు. రైతులతో అధికారులు నేరుగా మాట్లాడి ల్యాండ్‌ పూలింగ్‌కు వారిని ఒప్పించాలని సూచించారు. ల్యాండ్‌ పూలింగ్‌పై రైతులు లేవనెత్తుతున్న సందేహాలను నివృత్తి చేసి, వారికి పూర్తి అవగాహన కల్పించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రైతులు స్వచ్ఛందంగా భూసమీకరణ ప్రక్రియకు సహకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.