xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
తెలంగాణ

వికారాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా పడి నలుగురు మృతి

03-10-2026 14:13
వికారాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా పడి నలుగురు మృతి
వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పట్ల గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
xPress24, Vikarabad, October 3, వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కేసారం నుంచి ధారూర్ మండలం చింతకుంటకు వెళ్తున్న బస్సు ఘాట్ దిగిన తర్వాత ఓ మూలమలుపు వద్ద బోల్తా పడింది. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ ప్రమాద ఘటనపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించగా, బాధితులు త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.