xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
ఆంధ్రప్రదేశ్

విజయనగరం ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి

03-10-2026 16:47
విజయనగరం ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి
విజయనగరం ఉత్సవాలు–2026ను అత్యంత వైభవంగా, ప్రజలందరూ మెచ్చేలా విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
xPress24, Vizianagaram, October 3, విజయనగరం, అక్టోబరు 3: విజయనగరం ఉత్సవాలు–2026ను అత్యంత వైభవంగా, ప్రజలందరూ మెచ్చేలా విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, నిర్దేశించిన గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేయడంతోపాటు, టెండర్ల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, పనులను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఉత్సవాలు ప్రారంభమయ్యేలోగా అన్ని ఏర్పాట్లతోపాటు మౌలిక సదుపాయాల కల్పన పనులను కూడా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.