ఆంధ్రప్రదేశ్
విజయవాడ ఉత్సవం కర్టెన్ రైజర్ కార్యక్రమం
29-09-2026 09:58

దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డా. బి.ఆర్. అంబేద్కర్ కళా వేదికలో సోమవారం నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి సోమవారం పాల్గొని మాట్లాడుతూ... అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ్-2.0ను నిర్వహించనున్నట్లు చెప్పారు. తోలుబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవ్ వేదికగా నిలుస్తుందని మంత్రి తెలియజేశారు.
xPress24, Vijayawada, September 29,