ఆంధ్రప్రదేశ్
విజయవాడ ఉత్సవ్–2.0కు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఆహ్వానం
05-10-2026 13:09
విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్–2.0కు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ఆహ్వానించారు.
xPress24, Delhi, October 5,
ఢిల్లీ:
విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు,
విజయవాడ ఉత్సవ్–2.0
కు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ఆహ్వానించారు. ఎన్‌టీఆర్ జిల్లా ఇన్‌చార్జ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీలు కేశినేని చిన్ని, హరీష్ బాలయోగి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఉత్సవాలకు ఆహ్వానం అందించారు.
విజయవాడలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారి దివ్య ఆశీస్సులు పొందడంతో పాటు, నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని కేంద్ర మంత్రిని వారు కోరారు. దసరా నవరాత్రి వేడుకల్లో,
విజయవాడ ఉత్సవ్–2.0
లో కేంద్ర మంత్రి భాగస్వామ్యం కావాలని ఆత్మీయంగా ఆహ్వానించారు.
విజయవాడకు ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పే లక్ష్యంతో విజయవాడ ఉత్సవ్–2.0ను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. దసరా నవరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించడంతో పాటు, విజయవాడ సాంస్కృతిక విశిష్టతను దేశానికి పరిచయం చేసేలా ఉత్సవాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.