ఆంధ్రప్రదేశ్
విజయవాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
01-10-2026 16:34
విజయవాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా ఆధ్వర్యంలో ‘స్వచ్ఛత హి సేవా’ కార్యక్రమాన్ని నిర్వహించారు
xPress24, Vijayawada, October 1,
విజయవాడ:
విజయవాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా ఆధ్వర్యంలో ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డీఆర్‌ఎం కార్యాలయ అధికారులు, రైల్వే స్టేషన్ అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని స్టేషన్ పరిసరాలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్‌తో పాటు రైళ్లలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాల్సిన బాధ్యత ఉందన్నారు. చెత్త, ప్లాస్టిక్ వస్తువులను ఎక్కడపడితే అక్కడ వేయకుండా డస్ట్‌బిన్లలోనే వేయాలని సూచించారు. రైల్వే స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయాణికులు, అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.