xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

13-10-2026 14:06
విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు విజయవాడలో పర్యటించనున్నారు.
xPress24, Vijayawada, October 13, విజయవాడ, అక్టోబర్ 13: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న రాష్ట్రపతి, అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. 15వ తేదీ ఉదయం పున్నమి ఘాట్‌లో నిర్వహించనున్న జాతీయ సరస్‌ మేళా–2026ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులు, లఖ్‌పతి దీదీలతో కలిసి విందులో పాల్గొంటారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విజయవాడలోని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. పర్యటన సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.