xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా
ఆంధ్రప్రదేశ్

వాతావరణం

26-09-2026 10:27
వాతావరణం
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4.11 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈరోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కృష్ణా నదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
xPress24, Amaravathi, September 26, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నిన్న  సాయంత్రానికి గోదావరి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4.11 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈరోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కృష్ణా నదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.