ఆంధ్రప్రదేశ్
వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు
05-10-2026 14:34

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో ఒప్పంద ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు.
xPress24, Amaravati, October 5,
అమరావతి, 05 అక్టోబర్ 2026 : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో ఒప్పంద ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. ఈ మేరకు అత్యవసర వైద్యం, ప్రసూతి, శస్త్రచికిత్స, సేవలు కొనసాగించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. ప్రతి ఆసుపత్రిలో ఒక సమన్వయ అధికారిని నియమించి, సిబ్బంది కేటాయింపు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, వైద్య సేవల కొనసాగింపును పర్యవేక్షించాలని సూచించారు. ఆసుపత్రుల పరిస్థితిపై రోజువారీగా సమీక్షించి నివేదికలు పంపాలని ఆదేశించారు.