ఆంధ్రప్రదేశ్
విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలు
08-10-2026 09:55

విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం అర్హులైన వారికి నాలుగు నెలల్లోనే కారుణ్య నియామక ఉత్తర్వులు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ జెన్‌కో సంస్థలో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 27 మందికి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి బుధవారం నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు 629 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా కోసం రాష్ట్రంలో విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
xPress24, Amaravati, October 8,