ఆంధ్రప్రదేశ్
విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు
06-10-2026 09:55

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి మంగళవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత మూడేళ్లలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల్లో 445 మందికి పైగా కారుణ్య నియామకాలు కల్పించినట్లు చెప్పారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
xPress24, Visakhapatnam, October 6,