తెలంగాణ
విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: హరీశ్‌రావు
08-10-2026 16:04

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని BRS శాసనసభాపక్ష ఉపనేత టి.హరీశ్‌రావు విమర్శించారు. 5,420 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారం, కరెంటు కోతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలను ఆయన ఖండించారు. యాదాద్రి ప్లాంట్‌కు బొగ్గు కేటాయింపులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రజలపై మోపిన ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, కోతలు లేకుండా చూడాలని కోరారు.
xPress24, HYDERABAD, October 8,