xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధంమచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధం
తెలంగాణ

విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ అసమర్థతే కారణం: హరీశ్‌రావు

15-10-2026 12:32
విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ అసమర్థతే కారణం: హరీశ్‌రావు
రాష్ట్రంలో విద్యుత్ కోతలు, కరెంట్ సంక్షోభానికి ప్రభుత్వ అసమర్థతే ప్రధాన కారణమని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తప్పు చేసి అధికారులపై నెపం నెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు పరిపాటిగా మారిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆరోపించారు.
xPress24, Hyderabad, October 15, తప్పు చేసి అధికారులపై నెపం నెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు పరిపాటిగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ కోతలకు, విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ అసమర్థత, ప్రణాళికారాహిత్యమే ప్రధాన కారణమని తెలిపారు. కనీసం బొగ్గు నిల్వలు కూడా సమకూర్చుకోకుండా, ముందస్తు సమీక్షలు నిర్వహించకుండా విద్యుత్ రంగాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. గత 9 నెలలుగా ఎల్‌నినో ప్రభావం గురించి వాతావరణ శాఖ, శాస్త్రవేత్తలు నిరంతరం హెచ్చరిస్తున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమై, ప్రస్తుతం తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి అధికారులను సస్పెండ్ చేస్తామని బెదిరింపులకు దిగడం సరైన విధానం కాదని హితవు పలికారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.