xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా
తెలంగాణ

విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే 1912కు కాల్ చేయండి: ఐరెడ్డి విజేందర్ రెడ్డి

26-09-2026 12:34
విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే 1912కు కాల్ చేయండి: ఐరెడ్డి విజేందర్ రెడ్డి
కరీంనగర్ జిల్లాలో వర్షాల కారణంగా ఎటువంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా...వాటిని వెంటనే పరిష్కరించడానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మ్యాన్ అండ్ మెటీరియల్ ను అందుబాటులో ఉంచి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ ఐరెడ్డి విజేందర్ రెడ్డి తెలిపారు.
xPress24, Karimnagar, HUZURABAD, September 26, కరీంనగర్ జిల్లాలో వర్షాల కారణంగా ఎటువంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా...వాటిని వెంటనే పరిష్కరించడానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మ్యాన్ అండ్ మెటీరియల్ ను అందుబాటులో ఉంచి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ ఐరెడ్డి విజేందర్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఎల్ నినో లాంటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది జిల్లాలో 800 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగగా....ఈసారి ఏకంగా 1,100 మెగావాట్లకు చేరుకుందని తెలిపారు. ఇటీవల అల్పపీడనం సమయంలో రైతులకు, ప్రజలకు ఏలాంటి సమస్యలు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యంగా హుజురాబాద్ ప్రాంతంలో ఈదురు గాలులు, పిడుగుపాటు కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వైర్లను సిబ్బంది వెంటనే అప్రమత్తమై పునరుద్ధరించినట్లు వెల్లడించారు. వర్షాల వల్లే కాకుండా ఎక్కడైనా విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే ప్రజలు వెంటనే 1912 నంబర్‌కు కాల్ చేయాలని లేదా స్థానిక విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే సిబ్బంది స్పందించి సమస్యను పరిష్కరిస్తారని విజేందర్ రెడ్డి దూరదర్శన్‌కు తెలిపారు. బైట్... ఐరెడ్డి విజేందర్ రెడ్డి , సూపరిండెంట్ ఆఫ్ ఇంజినీర్, విద్యుత్ శాఖ, కరీంనగర్ జిల్లా

🎥 వీడియో

విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే 1912కు కాల్ చేయండి: ఐరెడ్డి విజేందర్ రెడ్డి

విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే 1912కు కాల్ చేయండి: ఐరెడ్డి విజేందర్ రెడ్డి

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.