ఆంధ్రప్రదేశ్
వినుకొండలో మెగా జాబ్ మేళా
07-10-2026 17:47
వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు బుధవారం ప్రారంభించారు.
xPress24, Vinukonda, October 7,
పల్నాడు జిల్లా, అక్టోబర్ 7:
వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రతి ఏడాది వినుకొండలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. యువతకు అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మెగా జాబ్ మేళాలో 46 ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులకు జి.వి. ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులకు ఆయన చేతుల మీదుగా ఉద్యోగ ఆఫర్ లెటర్లను అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగార్థులు తదితరులు పాల్గొన్నారు.