xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూవినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూ
ఆంధ్రప్రదేశ్

వన్యప్రాణి సంరక్షణ మనందరి బాధ్యత

07-10-2026 13:55
వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని బుధవారం మార్కాపురంలోని అటవీ శాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన 2కె రన్‌ను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
xPress24, Ongole, October 7, మార్కాపురం: వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని బుధవారం మార్కాపురంలోని అటవీ శాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన 2కె రన్‌ను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అడవులను, అడవుల్లోని వన్యప్రాణులను సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చన్నారు. నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యంలో ప్రకాశం జిల్లాలో 35 పులులు ఉన్నాయని, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించడమే వన్యప్రాణి వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుంచి వారోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

🎥 వీడియో

వన్యప్రాణి సంరక్షణ మనందరి బాధ్యత

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.