xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తీరం దాటిన వాయుగుండంతుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంమంత్రివర్గ నిర్ణయాలువాయుగుండం ప్రభావంపై కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్పోషణ్‌ అభియాన్‌ ఫోటో ఎగ్జిబిషన్‌విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ-వేలంతీరం దాటిన వాయుగుండంతుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంమంత్రివర్గ నిర్ణయాలువాయుగుండం ప్రభావంపై కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్పోషణ్‌ అభియాన్‌ ఫోటో ఎగ్జిబిషన్‌విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ-వేలం
ఆంధ్రప్రదేశ్

వాయుగుండం ప్రభావంపై కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్

24-09-2026 10:06
వాయుగుండం ప్రభావంపై కలెక్టర్లతో సీఎం  టెలీకాన్ఫరెన్స్
తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా బుధవారం అర్ధ రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి, క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు.వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు గురువారం కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
xPress24, Amaravati, September 24, తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా  బుధవారం అర్ధ రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.  వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి, క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు.వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు   గురువారం  కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు.  ఈ సమీక్షలో  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.