ఆంధ్రప్రదేశ్
వాయుగుండం ప్రభావంపై మంత్రుల సమీక్ష
23-09-2026 14:39
వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను మంత్రులు నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అదనపు సిబ్బందితో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉన్నందున మున్సిపల్, పారిశుధ్య, ఆర్టీసీ, రవాణా సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలని మంత్రులు ఆదేశించారు. విజయవాడలో కొండ ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వర్షాల పరిస్థితిని అమరావతి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మున్సిపల్, ఆర్టీసీ, రవాణా శాఖల ఉన్నతాధికారులకు మంత్రులు సూచించారు.
xPress24, Amaravati, September 23,