xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలురాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
ఆంధ్రప్రదేశ్

వరుణ మంత్ర జపం శుభ పరిణామం

06-10-2026 14:24
వరుణ మంత్ర జపం శుభ పరిణామం
కాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలనే సత్సంకల్పంతో వరుణ మంత్ర జపాన్ని నిర్వహించడం శుభ పరిణామమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.
xPress24, Bhimavaram, October 6, భీమవరం: సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలనే సత్సంకల్పంతో వరుణ మంత్ర జపాన్ని నిర్వహించడం శుభ పరిణామమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న వరుణ మంత్ర జపం పూజలను మంగళవారం ప్రారంభించారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య వరుణ మంత్ర జపం పూజలను నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.