ఆంధ్రప్రదేశ్
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ-వేలం
24-09-2026 10:04

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్శిళ్ల ఈ-వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్-ఎన్‌ఎల్‌ఎంసీ బుధవారం విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్‌ఎల్‌ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్‌ఐఎన్‌ఎల్ సీఎండీ ఎం.ఎన్.వి.ఎస్. ప్రభాకర్ ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ విధానం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ), ఈ-వేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈ-వేలం అక్టోబర్ 12, 16 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ -ఈఎండీగా రెండు లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈ-వేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం విజయవాడలో, శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
xPress24, Visakhapatnam, September 24,