ఆంధ్రప్రదేశ్
విశాఖలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన
05-10-2026 14:21

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నుంచి రెండు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.
xPress24, Visakhapatanam, October 5,
విశాఖపట్నం:
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నుంచి రెండు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం విశాఖ నేవల్ డాక్‌యార్డులోని ఎన్-14ఏ జెట్టీలో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొని నౌకాదళ సిబ్బందితో ముచ్చటించనున్నారు. అనంతరం అక్కడే నిర్వహించే బడాఖానాలో పాల్గొంటారు. రాత్రికి నేవల్ బేస్‌లోని చోళా సూట్స్‌లో బస చేస్తారు.
మంగళవారం ఉదయం హిందుస్థాన్ షిప్‌యార్డ్‌ను సందర్శించనున్న రక్షణ మంత్రి, అక్కడ స్లిప్‌వే-4ను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్‌ఎస్‌ఎస్-4 నౌకకు కీల్ లేయింగ్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు, ఎఫ్‌ఎస్‌ఎస్-1 నౌకను ప్రారంభించనున్నారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ ఒడిశాకు బయలుదేరి వెళ్లనున్నారు.