ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు గర్వకారణం
13-10-2026 14:05

శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం తెలుగు రాష్ట్రాలకి గర్వకారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
xPress24, Amaravati, October 13,
అమరావతి, 13 అక్టోబర్ 2026 : శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం తెలుగు రాష్ట్రాలకి గర్వకారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు శ్రీశైలమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దశాబ్దాలుగా లక్షలాది ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు భారీ వరదలను తట్టుకున్న జలాశయం నిర్మాణానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఆనందదాయకమన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇంజినీరింగ్ పటిష్ఠత, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, బహుముఖ ప్రయోజనాలకు ఈ గుర్తింపు నిదర్శనమని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.