ఆంధ్రప్రదేశ్
శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది
03-10-2026 17:05

తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టీఐఎల్ కంపెనీలో జరిగిన ఘటనలో బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
xPress24, Thirupati, October 3,
తిరుపతి, అక్టోబర్ 3:
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టీఐఎల్ కంపెనీలో జరిగిన ఘటనలో బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు కలెక్టర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు. అలాగే ప్రతి మృతుడి కుటుంబం నుంచి ఒకరికి శ్రీసిటీలోనే ఉద్యోగం కల్పిస్తామని వెల్లడించారు.
ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
బైట్: ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా కలెక్టర్