తెలంగాణ
సీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్ నిరసన ర్యాలీ
28-09-2026 16:57

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఇందులోభాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్‌లో నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అలాగే, ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టింది.
xPress24, HYDERABAD, September 28,