తెలంగాణ
సీఎం సభకు మహిళా సంఘాలను బెదిరిస్తున్నారంటూ బీజేపీ విమర్శ
30-09-2026 15:53

సిరిసిల్లలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు హాజరుకాకపోతే జరిమానా విధిస్తామని మహిళా సంఘాలను బెదిరించడం కాంగ్రెస్ నిరంకుశత్వానికి పరాకాష్ట అని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌ఛార్జ్ ఎన్.వి. సుభాష్ విమర్శించారు. స్వచ్ఛందంగా జనం రారని తెలిసి, సభలో పరువు పోతుందనే భయంతోనే వీవోఏల ద్వారా హుకుం జారీ చేయించారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతోందా, లేక నిజాం రజాకార్ల ఫత్వా పాలన సాగుతోందా అని ప్రశ్నించారు.
xPress24, HYDERABAD, September 30,