తెలంగాణ
సాంకేతిక లోపంతో శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్
30-09-2026 15:55

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. శంషాబాద్ నుండి విజయవాడ బయలుదేరిన 591 ఎయిర్‌లైన్స్ విమానంలో... టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో అధికారులు అప్రమత్తమై, విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా కిందకు దించారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
xPress24, HYDERABAD, September 30,