తెలంగాణ
సికింద్రాబాద్-కాకినాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు
07-10-2026 11:14

దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్టు ప్రకటించింది.
xPress24, Hyderabad, October 7,
దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్- కాకినాడ మధ్య రెండు ప్రత్యేకరైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. 07817 ప్రత్యేకరైలు ఈ నెల 9న సికింద్రాబాద్ నుంచి రాత్రి 7.25 గంటలకు, 07818 ప్రత్యేకరైలు ఈ నెల 10న కాకినాడ నుంచి రాత్రి 9 గంటలకు బయల్దేరుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్ పేర్కొన్నారు. మార్గమధ్యంలో ప్రత్యేకరైళ్లకు చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్లలో హాల్ట్ ఉంటుందని ఆయన వెల్లడించారు