xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
అంతర్జాతీయం

సంక్షోభాల పరిష్కారానికి గ్లోబల్ సౌత్ దేశాల సమష్టి కృషి అవసరం: జైశంకర్

23-09-2026 14:39
సంక్షోభాల పరిష్కారానికి గ్లోబల్ సౌత్ దేశాల సమష్టి కృషి అవసరం: జైశంకర్
ఐరాస వేదికగా జరిగిన సమావేశంలో గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యతను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ నొక్కిచెప్పారు. సరఫరా గొలుసులు, ఇంధనం, ఆహార భద్రత సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించాలని సూచించారు. ఇటలీ మంత్రితో ఐమెక్ ప్రాజెక్టుపై చర్చించిన ఆయన, భారత్-సెలాక్ వాణిజ్యం 50 బిలియన్ డాలర్లకు చేరిందని పేర్కొన్నారు.
xPress24, Delhi, September 23, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ముప్పు, అంతర్జాతీయ వ్యవస్థపై ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ‘గ్లోబల్ సౌత్’ దేశాల మధ్య సహకారం మరింత విస్తృతం కావాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ పిలుపునిచ్చారు. న్యూయార్క్‌లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ దేశాల సమావేశంలో జైశంకర్ ప్రసంగించారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న యుద్ధాలు, సరఫరా గొలుసులపై ఒత్తిడి, పెట్టుబడుల మందగమనం, దేశాలపై అప్పుల భారం వంటి సవాళ్లను అధిగమించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసికట్టుగా పోరాడాలని స్పష్టం చేశారు. ఇంధన, ఆహార భద్రతపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు ఇంధన లభ్యత, ధరల కృత్రిమ నియంత్రణలను అడ్డుకోవాలని, ఆహార భద్రతను కాపాడేందుకు ఆహార ధాన్యాలు, ఎరువుల సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జైశంకర్ సూచించారు. సముద్ర మార్గాల భద్రత, నావికుల రక్షణతో పాటు అంతర్జాతీయ వాణిజ్యంలో పారదర్శక పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల వచ్చే మార్పులు అసమానతలకు దారితీయకుండా సమతుల్యంగా నిర్వహించాలని, గ్లోబల్ సౌత్ దేశాలకు సంబంధించిన నిర్ణయాధికారాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. భారత్-సెలాక్ వాణిజ్యం 50 బిలియన్ డాలర్లు ఈ పర్యటనలో భాగంగా ఇటలీ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీతో జైశంకర్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐమెక్), ఉక్రెయిన్ సంక్షోభం, గల్ఫ్ పరిణామాలపై సమీక్షించారు. అనంతరం జరిగిన ఇండియా-సెలాక్ (లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమి) విదేశాంగ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత్-సెలాక్ వార్షిక వాణిజ్యం 50 బిలియన్ డాలర్లను దాటిందని వెల్లడించిన జైశంకర్, గత దశాబ్ద కాలంలో భారత్ జీడీపీ రెట్టింపు అయి ప్రపంచంలోనే కీలక ఆర్థిక శక్తిగా ఎదిగిందని వివరించారు. కరేబియన్, లాటిన్ అమెరికా దేశాలకు భారత్ అందించిన వైద్య, ప్రకృతి విపత్తుల సహాయాన్ని గుర్తుచేస్తూ, వచ్చే ఏడాది నుంచి ద్వైపాక్షిక వార్షిక వాణిజ్య సదస్సును మరింత ఉన్నత స్థాయికి విస్తరించాలని ప్రతిపాదించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.