ఆంధ్రప్రదేశ్
సాగునీటి వ్యవస్థ బలోపేతం
28-09-2026 14:31

రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాలువలు, జలాశయాల నిర్వహణ, మరమత్తు పనులకు సంబంధించి 160 కోట్ల రూపాయల బిల్లులు ప్రభుత్వం విడుదల చేసిందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ, మరమత్తు పనుల కోసం రెండేళ్లలో ప్రభుత్వం 1,320 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్ధరించి, రైతుల భాగస్వామ్యంతో సాగునీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించడంలో సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
xPress24, Amaravati, September 28,