అంతర్జాతీయం
సింగపూర్‌లో గ్లోబల్ ఫైనాన్షియల్ లీడర్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ
12-10-2026 10:57
సింగపూర్‌లో అంతర్జాతీయ ఆర్థిక రంగ దిగ్గజాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. భారతదేశంలో సుస్థిర ఆర్థిక వృద్ధి, తయారీ, మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న భారీ పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ, దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆమె అంతర్జాతీయ ఇన్వెస్టర్లను కోరారు.
xPress24, Delhi, October 12,
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సింగపూర్ పర్యటనలో భాగంగా అంతర్జాతీయ ఆర్థిక రంగ ప్రముఖులు, ఇన్వెస్టర్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ లో వేగంగా పుంజుకుంటున్న బలమైన ఆర్థిక వృద్ధిని, వివిధ రంగాల్లో అందుబాటులో ఉన్న అద్భుతమైన పెట్టుబడి అవకాశాలను వివరించారు. భారత్‌లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ మౌలిక వసతుల విస్తరణ, పారదర్శక విధానాల వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులకు దేశం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్లు ముందుకు రావాలని ఆమె ఆహ్వానించారు.