xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలుమహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు
తెలంగాణ

సింగరేణి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలి: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్

16-10-2026 17:18
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం బోనస్ చెల్లించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ... సంస్థ వాస్తవ లాభాలను బయటపెట్టాలని, కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.
xPress24, Mancherial, October 16, సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ శాతం వాటాను ప్రకటించడాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి తప్పుబట్టారు.  మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో  రఘునాథ్ వెరబెల్లితో పాటు జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం సింగరేణి సంస్థ వాస్తవ లాభాలను ప్రకటించకుండా అంకెల గారడీతో కార్మికులను మోసం చేస్తోందని విమర్శించారు. గత ఏడాది కార్మికులకు రూ. 2.50 లక్షలు ఇస్తే, ఈ ఏడాది రూ. 1.50 లక్షల బోనస్ మాత్రమే ఇవ్వడం సరికాదన్నారు. కార్మికులు శ్రమించి బొగ్గు ఉత్పత్తి చేస్తే వస్తున్న లాభాలను ప్రభుత్వం ఇతర ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపించారు. వాస్తవ లాభాల లెక్కలు బయటపెట్టాలి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని ఏటీఎంలా వాడుకుంటున్నాయే తప్ప సంస్థకు రావాల్సిన బకాయిలను చెల్లించడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల లెక్కలను తక్షణమే బయటపెట్టాలని, కార్మికులకు 35 శాతం బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో మరణించిన, డబుల్ ఓట్లను మాత్రమే తొలగిస్తున్నారని, అర్హుల ఓట్లు ఏవీ తొలగించలేదని వివరించారు. కిషన్ రెడ్డి చొరవతో బొగ్గు బ్లాకులు మంజూరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ వల్ల అనేక ఏండ్లుగా పర్యావరణ అనుమతులు రాక పెండింగ్‌లో ఉన్న నైని కోల్ బ్లాక్‌కు అన్ని అనుమతులు లభించాయని రఘునాథ్ గుర్తుచేశారు. తాడిచర్ల-2 ప్రాజెక్ట్, మణుగూరు డీప్ సైడ్ బ్లాక్ కూడా ఆయన చొరవతోనే సింగరేణికి దక్కాయని తెలిపారు. కార్మికులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బైట్ - రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

🎥 వీడియో

సింగరేణి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలి: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.