తెలంగాణ
సింగరేణి కార్మికులకు బోనస్
06-10-2026 09:42

దసరా, దీపావళి పండగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి లక్షా 10 వేల 250 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. దేశానికి వెలుగులు పంచేందుకు పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణలో లక్షలాది కుటుంబాలకు జీవనాధారమని కిషన్‌రెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 60 వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కిషన్‌రెడ్డి కోరారు.
xPress24, Hyderabad, October 6,