తెలంగాణ
సింగరేణి లాభాల్లో 34 శాతం వాటా ప్రకటించిన ప్రభుత్వం.. ఒక్కొక్కరికి రూ.1.53 లక్షల బోనస్
13-10-2026 14:40
దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం 34 శాతం లాభాల వాటాను ప్రకటించింది. సంస్థకు వచ్చిన రూ.1,754 కోట్ల లాభాల్లో ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.53 లక్షల బోనస్ అందనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు.
xPress24, Hyderabad, October 13,
సింగరేణి కాలరీస్ సంస్థ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకను ప్రకటించింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా సంస్థ ఆర్జించిన నికర లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటాను బోనస్‌గా అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ ఏడాది సింగరేణి సంస్థ రూ.1,754 కోట్ల లాభాలను ఆర్జించిందనితెలిపారు. ఇందులో కార్మికుల వాటా కింద ఒక్కొక్కరికి దాదాపు రూ.1,53,000 చొప్పున బోనస్ అందుతుందని పేర్కొన్నారు. సింగరేణిలో ప్రస్తుతం 38 వేల మంది శాశ్వత కార్మికులు పనిచేస్తున్నారని, వారికి నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
పెండింగ్‌లో ఉన్న 300 మంది డిపెండెంట్ కార్మికుల నియామక ఉత్తర్వులు, మారుపేర్ల సమస్యలను రాబోయే 15 రోజుల్లోగా శాశ్వతంగా పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిలో భాగంగా సింగరేణి పరిధిలోని అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
బైట్
మల్లు భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి