xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
చేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలుచేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలు
తెలంగాణ

సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: ఈటెల రాజేందర్

01-10-2026 12:14
సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: ఈటెల రాజేందర్
సింగరేణి సంస్థలో కార్మికుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సింగరేణిలోని అన్ని విభాగాలను ప్రైవేట్ పరం చేసందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
xPress24, Ramagundam, October 1, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనీలో ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు సింగరేణి సంస్థలో లక్షా 16 వేల మంది కార్మికులు ఉండగా.. ఇప్పుడు 39 వేలకు తగ్గిందని తెలిపారు. తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలోని అన్ని విభాగాలను ప్రైవేట్ పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎంపీ ఆరోపించారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టిని వెలికి తీసేందుకు మాత్రమే ప్రైవేట్ కాంట్రాక్టర్లను అనుమతించేవారని..కానీ ఇప్పుడు ఆ పంతా మారిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సింగరేణి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందన్నారు. సింగరేణికి రావాల్సిన 70 వేల కోట్ల రూపాయలను తక్షణమే చెల్లించాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణలో పంట పొలాలు ఎండిపోతున్నాయని అన్నారు. ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటిని సక్రమంగా వినియోగించకపోవడం వల్లే కరెంట్ కష్టాలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. బైట్- ఈటెల రాజేందర్, ఎంపీ, మల్కాజ్ గిరి

🎥 వీడియో

సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: ఈటెల రాజేందర్

సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: ఈటెల రాజేందర్

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.