తెలంగాణ
సింగరేణిలో నూతన బొగ్గు గనుల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి: మంత్రి వివేక్
07-10-2026 14:55

నూతన బొగ్గు గనులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో 31 లక్షలతో నిర్మించే రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సింగరేణి 70 మిలియన్ టన్నుల లక్ష్యం నుంచి 100 మిలియన్ టన్నులకు చేరుకోవాలంటే నూతన గనుల ఏర్పాటు అవసరం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో నూతన గనులు తీసుకురాలేదన్నారు.
xPress24, HYDERABAD, October 7,