ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేయాలి
13-10-2026 15:43
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు, డేటా పరిశీలన, ఎన్నికల ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
xPress24, Konaseema, October 13,
కోనసీమ, అక్టోబర్ 13: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు, డేటా పరిశీలన, ఎన్నికల ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీపీ తదితర స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపులో ఎలాంటి పొరపాట్లకు, విచక్షణాధికారాల వినియోగానికి తావులేకుండా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఖరారుకు 2011 జనాభా లెక్కలను, బీసీ రిజర్వేషన్లకు సంబంధిత ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశించిన గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ఖరారులో రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్‌లో నమోదైన నిర్ధారిత ఓటర్ల జాబితా సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా పరిగణించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.