ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధం
15-10-2026 14:29

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
xPress24, Tirupati, October 15,
తిరుపతి జిల్లా, అక్టోబర్ 15:
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తిరుపతిలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని వెల్లడించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికల భద్రతను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
బైట్:
వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా కలెక్టర్