ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్లు
16-10-2026 17:18
పార్వతీపురం మన్యం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు–2026ను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు.
xPress24, Parvathipuram, October 16,
పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 16:
పార్వతీపురం మన్యం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు–2026ను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు.
జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూమ్ల ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సందేహాలు, అభ్యంతరాలు, ఫిర్యాదులను ప్రజలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.
ప్రజలు తమ ఫిర్యాదులు, సందేహాల పరిష్కారం కోసం కింది నంబర్లను సంప్రదించాలని సూచించారు.
పార్వతీపురం మున్సిపాలిటీ కార్యాలయం:
9704111502
పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం:
8309976920
సాలూరు మున్సిపాలిటీ కార్యాలయం:
9703657680
“మీ ఓటు–అభ్యున్నతికి బాట”
అనే నినాదంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణలో పౌరులందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడేందుకు ప్రజలు తమ సందేహాలు, అభ్యంతరాలు, ఫిర్యాదులను సంబంధిత కంట్రోల్ రూమ్లకు తెలియజేయాలని ఆయన కోరారు.