xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలుమహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

16-10-2026 14:17
స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
xPress24, Vizianagaram, October 16, విజయనగరం, అక్టోబరు 16: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్‌తో కలిసి సంబంధిత అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు మొత్తం 12,944 మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా వేయగా, ప్రస్తుతం 17,487 మంది సిబ్బందిని ప్రతిపాదించినట్లు తెలిపారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 121 వార్డులు, 322 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మొత్తం 4,91,409 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన సిబ్బందిని నియమించడంతోపాటు, ఎన్నికల సామగ్రి, మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని, ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.