ఆంధ్రప్రదేశ్
స్పెయిన్‌లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
08-10-2026 09:51

ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్‌లోని సెవిల్లెలో జరుగుతున్న ‘టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్-2026’లో పాల్గొన్న మంత్రి... ఎక్స్‌ప్లర్జర్ సంస్థ రూపొందించిన ‘నివు ఏఐ’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని వందకు పైగా పర్యాటక ప్రాంతాల్లో కృత్రిమ మేధ ఏఐ స్మార్ట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటక ప్రాంతాల సమాచారం తెలుసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు కేవలం పర్యాటకులుగానే కాకుండా... భాగస్వాములుగా రావాలని పెట్టుబడిదారులకు మంత్రి పిలుపునిచ్చారు.
xPress24, Amaravati, October 8,