xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
జాతీయం

సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగడం సరికాదు: రాహుల్ గాంధీ మార్చ్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు విమర్శలు

13-10-2026 14:39
సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగడం సరికాదు: రాహుల్ గాంధీ మార్చ్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు విమర్శలు
ఓటర్ల సవరణ అంశంపై సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ నిర్వహించిన నిరసన మార్చ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తప్పుబట్టారు. న్యాయస్థానాన్ని రాజకీయాల్లోకి లాగడం రాజ్యాంగ విరుద్ధమని, అభ్యంతరాలు ఉంటే పిటిషన్ వేయాలని సూచించారు. కాగా, ఈ నిరసన ప్రదర్శనపై ఢిల్లీ పోలీసులు నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
xPress24, Delhi, October 13, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు వైపు చేపట్టిన నిరసన ప్రదర్శనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు విమర్శలు చేశారు. అత్యున్నత న్యాయస్థానాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగి దాని పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రాహుల్ గాంధీ న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సింది పోయి రోడ్లపైకి రావడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రాజకీయ వివాదాలు పరిష్కరించే కార్యాలయం కాదు: రామచందర్ రావు ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని, కేంద్ర ఎన్నికల సంఘం వాటిని తు.చ. తప్పకుండా అమలు చేస్తోందని రామచందర్ రావు గుర్తుచేశారు. బీహార్ ఎస్‌ఐఆర్ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఫారమ్-6కు అనుబంధ పత్రాన్ని జోడించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు విశ్వసనీయతను దెబ్బతీసేందుకు యత్నిస్తోందని విమర్శించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే న్యాయవాదుల ద్వారా పిటిషన్ వేయాలి తప్ప, సుప్రీంకోర్టు ఏదో రాజకీయ పంచాయితీలు తీర్చే కార్యాలయం అన్నట్లుగా మార్చ్ నిర్వహించడం న్యాయవ్యవస్థను, న్యాయవాద వృత్తిని అవమానించడమేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో 4 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు ఇండియా కూటమి సుప్రీంకోర్టు వైపు చేపట్టిన ర్యాలీకి సంబంధించి ఢిల్లీ పోలీసులు నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అనుమతి లేకుండా నిరసన చేపట్టడంపై తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో రెండు, మందిర్ మార్క్, బారాఖంబా పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.