xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బతుకమ్మ రద్దీకి సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ ప్రత్యేక రైలుఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలురాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణప్రత్యేక అవసరాల పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలి: గవర్నర్బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సీతక్కజీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలి: భట్టి విక్రమార్కబతుకమ్మ రద్దీకి సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ ప్రత్యేక రైలుఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలురాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణప్రత్యేక అవసరాల పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలి: గవర్నర్బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సీతక్కజీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలి: భట్టి విక్రమార్క
జాతీయం

సుపరిపాలనకు వారధిగా మొబైల్ సాంకేతికత: ప్రధాని మోదీ

09-10-2026 09:39
సుపరిపాలనకు వారధిగా మొబైల్ సాంకేతికత: ప్రధాని మోదీ
ఒకప్పుడు మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడిన మొబైల్ ఫోన్ నేడు సుపరిపాలనకు వారధిగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురువారం జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 కార్యక్రమంలో ఆయన ప్రసంగించి డిజిటల్ ఇండియా ప్రయాణాన్ని వివరించారు.
xPress24, Delhi, October 8, ఒకప్పుడు మాట్లాడుకోవడానికి, సందేశాలు పంపుకోవడానికి మాత్రమే ఉపయోగపడిన మొబైల్ ఫోన్ నేడు సుపరిపాలనకు వారధిగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజల అరచేతిలోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. గురువారం జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 కార్యక్రమంలో ఆయన ప్రసంగించి డిజిటల్ ఇండియా ప్రయాణాన్ని వివరించారు. ఐదుజీ సేవల విస్తరణతో దేశంలో ఇంటర్నెట్ వేగం గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం ప్రతి జిల్లాకు కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మొబైల్ సాంకేతికతతో ప్రయాణ సమయం, నిరీక్షణ, ఖర్చులు తగ్గాయని వెల్లడించారు. గేమింగ్, కంటెంట్ క్రియేషన్ వంటి కొత్త రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. డిజిటల్ సేవల ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు వేగంగా చేరుతున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో డిజిటల్ విప్లవం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాకే ప్రభుత్వ సంక్షేమ పథకాల సాయం చేరుతోందని ప్రధాని మోదీ వివరించారు. దీనిద్వారా 5 లక్షల కోట్ల మేర సొమ్ము తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అరికట్టగలిగామని తెలిపారు. సాంకేతికతను కొద్దిమందికే పరిమితం చేయకుండా, ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. డిజిటల్ సేవలు అందుబాటు ధరల్లో ఉండాలని, చివరి వ్యక్తి వరకు చేరాలని ఆకాంక్షించారు. సైబర్ మోసాలు, డీప్‌ఫేక్‌లపై అప్రమత్తత సైబర్ మోసాలను అరికట్టేందుకు నూతన సాంకేతిక పరిష్కారాలు అవసరమని అభిప్రాయపడ్డారు. డీప్‌ఫేక్‌ల మూలాలను గుర్తించే వ్యవస్థలు, తదితర సాంకేతికపరమైన సమస్యలపై ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.