ఆంధ్రప్రదేశ్
సబ్‌స్టేషన్ ప్రారంభం
29-09-2026 09:46

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా గోపవరంలో 55 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్‌స్టేషన్‌ను నిర్మించామని తెలిపారు. ఆక్వా రైతులకు రాయితీపై విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటివరకు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా 6 వేల కోట్ల రూపాయల వ్యయంతో సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు.
xPress24, Gopavaram, September 29,