xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
ఆంధ్రప్రదేశ్

సౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసా

13-10-2026 15:44
సౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసా
వాతావరణ మార్పులను అరికట్టడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కీలక పాత్ర పోషిస్తుందని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్. వైశాలి తెలిపారు.
xPress24, Parvathipuram, October 13, పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 13: వాతావరణ మార్పులను అరికట్టడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కీలక పాత్ర పోషిస్తుందని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్. వైశాలి తెలిపారు. మంగళవారం పార్వతీపురం కలెక్టరేట్ ఆవరణలో సేవా సేతు ప్రచార వాహనాన్ని, ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎస్సీ, ఎస్టీ సహా ఇతర వర్గాల గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సబ్సిడీలతో ఈ పథకం ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. డిసెంబర్ 31 నాటికి వంద శాతం లక్ష్యం ఏపీఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్. త్రినాథరావు మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సేతు అభియాన్ ద్వారా ప్రజల్లో సౌర విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ పథకం కింద 14,110 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించగా, ఇప్పటివరకు సుమారు 9 వేల ఇళ్లకు సోలార్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డిసెంబర్ 31 నాటికి నిర్దేశించిన వంద శాతం లక్ష్యాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అర్హులైన గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే లక్ష్యంతో సోలార్ ఫలకాలను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో వ్యవస్థ ఏర్పాటుకు అయ్యే రూ.1.25 లక్షల వ్యయంలో కేంద్ర ప్రభుత్వం రూ.60 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.65 వేలు భరిస్తున్నాయని వివరించారు. ఈ సోలార్ వ్యవస్థలు కనీసం 25 ఏళ్ల పాటు సేవలందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.